దేశంలో కరోనా వైరస్ రోజు రోజుకు తీవ్ర తరం అవుతున్న సంగతి తెలిసిందే. దీనిబారిన అనేక మంది రాజకీయ నేతలు పడగా, తాజాగా కర్ణాటక కాంగ్రెస్ నేత ఆర్ ప్రసన్న కుమార్‌కు కరోనా సోకింది. శివమొగ్గకు చెందిన ఆయన జూలై 27న బెంగళూరులో నిర్వహించిన పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అక్కడి నుంచి తిరిగి వచ్చిన అనంతరం ప్రసన్న కుమార్ కరోనా పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. తనను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని ప్రసన్న కుమార్ సూచించారు. కర్ణాటక సీఎం యెడియూరప్పకు కూడా కరోనా సోకిన సంగతి తెలిసిందే.