కరోనా తో బీజేపీ నేత మృతి

ప్రపంచ వ్యాప్తంగా కరోనా ఉదృతి కొనసాగుతూనే ఉంది. కొత్త కేసులే కాదు మరణాల సంఖ్య సైతం అంతే విధంగా పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఈ కరోనా బారిన పడి సామాన్య ప్రజలే కాక సినీ , రాజకీయ ప్రముఖులు మరణించగా ..తాజాగా బీజేపీ నేత, మాజీ మంత్రి మాణిక్యాల రావు(60) కన్నుమూశారు.

పశ్చిగోదావరి జిల్లాకు చెందిన మాణిక్యాలరావు 2014 ఎన్నికల్లో తొలిసారి బీజేపీ తరఫున పోటీ చేసి తాగేప‌ల్లిగూడెం ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తొలి ప్ర‌య‌త్నంలోనే అప్పటి టీడీపీ ప్రభుత్వంలో దేవాదాయశాఖ మంత్రిగా పనిచేశారు. 2014 నుంచి 2018 వరకు మంత్రిగా కొనసాగారు. కరోనా పాజిటివ్‌గా తేల‌డంతో గ‌త‌ నెల రోజులుగా విజయవాడలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప‌రిస్థితి విష‌మించ‌డంతో నేడు క‌న్నుమూశారు.