కరోనా తో తిరుమల శ్రీనివాసమూర్తి దీక్షితులు కన్నుమూత

కరోనా వైరస్ రెండు తెలుగు రాష్ట్రాల్లో రోజు రోజుకు విజ్ర్బిస్తున్న సంగతి తెలిసిందే. కేసులతో పాటు మరణాల సంఖ్య సైతం ఎక్కువగానే నమోదు అవుతున్నాయి. తాజాగా తిరుమల శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకుడు శ్రీనివాసమూర్తి దీక్షితులు (75) కరోనా తో మృతి చెందారు. ఆయన గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో భాదపడుతున్నారు.

కాగా నాలుగురోజుల క్రితం ఆయన కరోనా తో స్విమ్స్ ఆస్పత్రిలో చేరారు. పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలోనే ఆయన కన్ను మూసారు. 30సంవత్సరాలకు పైగా ఆయన శ్రీవారి ఆలయంలో సేవలందించారు. ఆయనకు ఇద్దరు కుమారులు ఉండగా వారిలో పెద్ద కుమారుడు దయానిధిమూర్తి దీక్షితులు గోవిందరాజస్వామి ఆలయంలో అర్చకుడిగా చేస్తున్నాడు. చిన్న కుమారుడు నరసింహమూర్తి దీక్షితులు శ్రీవారి ఆలయంలో అర్చకుడిగా సేవలందిస్తున్నారు.