కడప లో లాక్ డౌన్..ఎప్పటివరకు అంటే

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో పలు జిల్లాలు లాక్ డౌన్ దిశగా అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా కడప లో కేసుల సంఖ్య ఎక్కువగా ఉండడం తో రేపటి నుంచి లాక్ డౌన్ ను అమలు చేయాలని నిర్ణయించారు. ఉదయం 10 గంటల వరకు మాత్రమే షాపులకు అనుమతి ఇచ్చారు. ఉదయం 10 గంటల తరువాత షాపులు క్లోజ్ చేయాలని ఇప్పటికే అధికారులు, పోలీసులు ప్రచారం నిర్వహించారు.

ఉదయం 10 గంటల తరువాత ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలు బయటకు రావొద్దని హెచ్చరించారు. కరోనా నివారణకు ప్రజలు సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. నిబంధనలు అతిక్రమించి బయటకు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటి వరకు ఆ జిల్లాలో మొత్తం 4361 కేసులు నమోదయ్యాయి. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండటంతో కరోనా వైరస్ ను కంట్రోల్ చేసేందుకు కడప అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.