ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన మంత్రులుగా చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, సీదిరి అప్పలరాజు ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసందే. కాగా వీరికి సచివాలయంలో ఛాంబర్లు కేటాయించారు. మాజీమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ఛాంబర్‌ను వేణుగోపాలకృష్ణ, మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణారావు ఛాంబర్‌ను అప్పలరాజుకు కేటాయించారు.
అయితే రోడ్లు, భవనాల శాఖ మంత్రి శంకర్ నారయణ, డిప్యూటీ సీఎం రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ పాత ఛాంబర్లనే వినియోగించుకోనున్నారు.