ఏపీ కరోనా అప్డేట్ ..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా ఉదృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 53,681 కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేయగా 7,813 పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్లు హెల్త్ బులిటిన్ లో తెలిపారు. ఈరోజు నమోదు అయినా కేసులతో మొత్తం కేసుల సంఖ్య 88,671 కు చేరింది.

తాజా పరీక్షల్లో 27,955 ట్రూనాట్‌ పద్ధతిలో, 25,726 ర్యాపిడ్‌ టెస్టింగ్‌ పద్ధతిలో చేశారు. కొత్తగా 3,208 మంది వైరస్‌ బాధితులు కోలుకుని శనివారం డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 44,431 యాక్టివ్‌ కేసులున్నాయి. వైరస్‌ బాధితుల్లో తాజాగా 52 మంది మృతి చెందడంతో.. మొత్తం మరణాల సంఖ్య 985 కు చేరింది.

#COVIDUpdates: 25/07/2020, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 85,776 పాజిటివ్ కేసు లకు గాను
*40,406 మంది డిశ్చార్జ్ కాగా
*985 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 44,385#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/TIoAoChucE— ArogyaAndhra (@ArogyaAndhra) July 25, 2020