ఏపీలో మరోసారి భారీగా కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో 61,838 నమూనాలను పరీక్షించగా రికార్డు స్థాయిలో 10,830 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్లో పేర్కొంది. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 1,528 కేసులు.. అత్యల్పంగా కృష్ణా జిల్లాలో 299 కేసులు నమోదయ్యాయి.
ఒక్కరోజులో 8,473 మంది కరోనా నుంచి కోలుకోగా.. 81 మంది చికిత్స పొందుతూ మృతిచెందారు. తూర్పుగోదావరిలో 11 మంది, ప్రకాశం 9, చిత్తూరు 8, కడప 8, అనంతపురం 6, పశ్చిమగోదావరి 6, కృష్ణా 5, కర్నూలు 5, నెల్లూరు 5, విశాఖపట్నం 5, విజయనగరం 5, గుంటూరు 4, శ్రీకాకుళం జిల్లాలో నలుగురు కరోనాతో మృతిచెందినట్లు బులెటిన్లో పేర్కొన్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 3,541కి చేరింది.