ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు చూస్తుంటే ప్రజల్లో రాష్ట్రం వదిలి పోతే బాగుండు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతిరోజు రాష్ట్రంలో కరోనా కేసులు వేలు దాటుతున్నాయి. గురువారం 8 వేలకు చేరుకుంటే..శుక్రవారం ఏకంగా 8 వేలు దాటాయి. దీంతో ప్రజల్లో భయం పట్టుకుంది.
గత 24 గంటల్లో 48,114 మందికి పరీక్షలు నిర్వహించగా ఏకంగా 8,147 మందికి పాజిటివ్ అని తేలింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 80,858కు చేరింది. గడచిన 24 గంటల్లో ఏకంగా 49 మంది చనిపోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 933కు చేరింది.