ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకు రికార్డ్స్ బ్రేక్ చేస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో 3,963 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 23,872 శాంపిల్స్‌ను పరీక్షించగా 3,963 మంది కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారించబడ్డారు. కోవిడ్-19తో తాజా 52 మంది మృతిచెందారు.
జిల్లాల వారీగా కేసులు చూస్తే..
తూర్పుగోదావరిలో 12 మంది, గుంటూరు- 8, కృష్ణా- 8, అనంతపూర్- 7, పశ్చిమ గోదావరి- 5, ప్రకాశం- 4, నెల్లూరు- 3, విశాఖపట్నం- 2, చిత్తూరు- 1, కడప- 1, విజయనగరంలో ఒకరు మరణించారు. ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 44,609 గా ఉండగా వీటిలో 22,260 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇక దేశ వ్యాప్తంగా చూస్తే..గత నాలుగు రోజులుగా ప్రతి రోజు 32 వేలకు పైచిలుకు కేసులు నమోదవుతున్నాయి. ఈ రోజుకూడా 34 వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది. దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 34,884 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 10,38,716కు చేరింది. ఇందులో 3,58,692 యాక్టివ్ కేసులు ఉండగా, కరోనా బారినపడిన మరో 6,53,751 మంది బాధితులు కోలుకున్నారు. కరోనా వైరస్ వల్ల కొత్తగా 671 మంది మరణించడంతో, మొత్తం కరోనా మృతులు 26,273కు పెరిగారు.