చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో షాకే తగిలింది. .కుప్పం లో ఆయన రోడ్ షో చేస్తున్నప్పుడు కొందరు కార్యకర్తలు కుప్పం కు జూ. ఎన్టీఆర్ ఎన్నికల ప్రచారానికి పంపించాలని కోరారు. ఇది మీడియాలో వచ్చేసింది. కుప్పం నియోజకవర్గంలోని 89 పంచాయతీలకు గాను 75 పంచాయతీలను అదికార వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్న అవమానాన్ని భరించలేక ఇబ్బంది పడుతున్న చంద్రబాబును ఈ కోరిక మరింత ఇరుకున పెట్టేసింది.
తెలుగుదేశం పార్టీకి తారక్ దూరమయ్యారు. కాదు.. చంద్రబాబే తారక్ ని దూరం పెట్టేశారని కొందరిమాట. ఇప్పుడు టీడీపీని ముందుకు తీసుకెళ్ల బాధ్యత లోకేష్ పై వుంది. ఐతే లోకేష్ కి ఎందుకు అంత మాస్ ఫాలోయింగ్ రావడం లేదు. ఇలాంటి నేపధ్యంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ తెరపైకి వచ్చి లోకేష్ వల్ల కాదు తారక్ ని సీన్ లో తీసుకురావాలనే అర్ధం వచ్చేట్లు కోరడం లోకేష్ ని ఇరుకునపెట్టె కోరికే అవుతుందని చెప్పాలి.