ఆంధ్రప్రదేశ్‌లో పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో భారీ కుంభకోణం జరిగిందని, వైసీపీ నేతలు లబ్ధి పొందారని ఆరోపణలు గుప్పిస్తోన్న టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు దీనిపై మరోసారి స్పందించారు. పేదలకు ఇళ్ల స్థలాల కోసం సేకరించిన ఆవ భూములు, వారికి ప్రభుత్వం ఇచ్చే సెంటు పట్టా భూముల కొనుగోళ్లలో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
‘పేదలకు పట్టాల పేరుతో “ఆవలో” కోట్ల రూపాయలు దండుకున్నారు పెద్దలు.. 7 లక్షల రూపాయల విలువగల భూమికి 45 నుండి 62 లక్షల రూపాయల చెల్లింపు. అక్రమాల్లో అధికారపార్టీ నేతల హస్తం, అక్కరకురాని అంతధర లేని భూములే ఎంపిక. ఇప్పటికే వందల కోట్ల రూపాయలు నేతల జేబుల్లోకి. మైలవరం, ఆవ సహా సెంటు పట్టాభూముల కొనుగోలుపై విచారణకు ఆదేశించే ధైర్యం ఉందా? వైఎస్ జగన్’ అని దేవినేని ఉమ ప్రశ్నించారు.