Site icon TeluguMirchi.com

ఆర్ఆర్ఆర్ స్వీట్ వార్నింగ్

తన సొంత పార్టీపై వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తన పార్టీకి చెందిన నేతలు ఇప్పటికీ తనపై బెదిరింపులకు పాల్పడుతున్నారని… ఎవరెన్ని బెదిరింపులకు పాల్పడినా ఉపయోగం ఉండదని అన్నారు. తనను బెదిరించాలనుకుంటున్న వాళ్లు ఒళ్లు దగ్గర పెట్టుకుని మసలితే మంచిదని హితవు పలికారు. వేధింపులకు తాళలేక కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, తాను ఆ రకం కాదని చెప్పారు.

ఎంతో అనుభవం ఉన్న రామచంద్రమూర్తి సలహాదారు పదవికి రాజీనామా చేయడం దురదృష్టకరమని రఘురాజు అన్నారు. డాక్టర్ రమేశ్ ను వేధిస్తున్న తీరు బాధాకరమని చెప్పారు. ఆయన సామాజికవర్గాన్ని సూచించేలా పేరు చివరన చౌదరి అని తగిలించి వేధిస్తున్నారని మండిపడ్డారు.

Exit mobile version