క్రీడా దినోత్సవం రోజున వైకాపా పరువు పాయే

ఈమద్య కాలంలో సోషల్‌ మీడియా పరిధి ఏ స్థాయిలో పెరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్న తప్పును కూడా బూతద్దంలో చూపించేందుకు జనాలు రెడీగా ఉంటున్నారు. అందుకే ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా రాజకీయ నాయకులు మరియు సెలబ్రెటీలు తాము చేసే ప్రతి పనిలో కూడా లోపాలు లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. కాస్త అశ్రద్ద వహిస్తే మొత్తం పరువు గంగపాలయ్యే అవకాశం ఉంది. తాజాగా వైకాపా చేసిన పని అలాగే ఉంది.

ప్రభుత్వం తరపున తాజాగా జాతీయ క్రీడా దినోత్సవంను నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రముఖ క్రీడాకారులకు జ్ఞాపకార్థం వారి ప్లెక్సీలను ఏర్పాటు చేయడం జరిగింది. అలా ఏర్పాటు చేసిన ఒక ప్లెక్సీలో పేరు తప్పుగా పడింది. టెన్నీస్‌ క్రీడాకారిణి సానియా మీర్జా ఫొటో పెట్టి పరుగుల రాణి పీటీ ఉష పేరును ఆ ఫొటో కింద పెట్టారు. సానియా మీర్జా పేరును పీటీ ఉషాగా మార్చేశారు అంటూ నారా లోకేష్‌ ఎద్దేవ చేశాడు. ప్రస్తుతం పరిస్థితి ఇలా ఉందని వైకాపా ప్రభుత్వంపై లోకేష్‌ విమర్శించాడు. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.