భారత్‌లో కరోనా వైరస్ వ్యతిరేక పోరాటానికి గానూ ప్రపంచ బ్యాంకు 1 బిలియన్ డాలర్ల భారీ ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 25 అభివృద్ధి చెందుతున్న దేశాలకు కేటాయించిన అత్యవసర సహాయ నిధిలో తొలివిడతగా 1.9 బిలియన్ డాలర్లను సంస్థ విడుదల చేయనుంది.
కరోనా వ్యాప్తి నివారణకు ప్రపంచ దేశాలు లాక్‌డౌన్‌ను పాటిస్తున్న నేపథ్యంలో అనేక సేవలకు, సరఫరాకు ఆటంకం కలుగుతోంది. ఈ నేపథ్యంలో బాధితులకు ప్రభుత్వాల ద్వారా అత్యవసర వైద్య సామగ్రి అందించేందుకు కూడా ప్రపంచ బ్యాంకు కృషిచేస్తోంది. సహాయం కోరిన దేశాలకు ఎనిమిది బిలియన్ డాలర్లు అందచేస్తామని సంస్థ ప్రకటించిన సంగతి తెలిసిందే.