నిత్యం ఏదో వార్త తో వార్తలో నిలిచే ఉత్తర ప్రదేశ్ , ఈరోజు కూడా ఓ వార్త తో హాట్ టాపిక్ అయ్యింది..ప్రియుడు లేచిపోవడానికి రాలేదని నడి రోడ్డు పై ఆ ప్రియురాలు చెప్పు తో కొట్టింది..వివరాల్లోకి వెళ్తే..
ఉత్తరప్రదేశ్ లో కాన్పూర్లో ఈ ఘటన జరిగింది. బల్జీత్(30) అనే వ్యక్తి ముగ్గురు పిల్లల తల్లి అయిన మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఇక ఇద్దరూ కలిసి లేచిపోవాలని నిర్ణయం తీసుకున్నారు..భర్త కు తెలియకుండా ఆమె వెళ్లిపోవడానికి రెడీ అయ్యింది..కానీ బల్జీత్ మాత్రం మొదటగా వెళ్దాం అని చెప్పి తీరా ఆమె వెళ్దాం అని వచ్చేసరికి మాట మార్చాడు. దీంతో ఆమె అతన్ని నడిరోడ్డుపైనే చెప్పులతో చితకబాదింది. సమాచారం అందుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.