లవర్స్ పై దాడి చేసి, అమ్మాయిని రేప్ చేసిన బ్లేడ్ బ్యాచ్ !

సీతానగరంలో పుష్కర్ ఘాట్ కి వెళ్లిన పెళ్లి కానీ జంటపై ఇద్దరు గుర్తుతెలియని దుండగులు దాడిచేశారు. తనకు కాబోయే భర్తను కట్టేసి తన కళ్ళముందే ఆ అమ్మాయిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు, ఈ ఘటన శనివారం రాత్రి జరిగింది. బాధితురాలు ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో నర్స్ గా పనిచేస్తుండగా, అతను పెట్రోల్ బంక్ లో పనిచేస్తున్నట్లు తెలుస్తుంది.

తరువాత రోజు ఉదయం ఆ జంట తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసారు, ఆ తరువాత బాధితురాలిని వైద్యంకోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. బాధితులు , నిందితుల వివరాలు పూర్తిగా చెప్పనందున పోలీసులు అనుమానితులని అందరిని ఇంట్రాగేట్ చేస్తున్నారు, మరోవైపు ఇందులో నటోరియస్ క్రిమినల్ గ్యాంగ్ ‘బ్లేడ్ బ్యాచ్’ పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ ఘటనపై మూడు పోలీస్ బృందాలను ఏర్పాటుచేసి నిందులకోసం గాలింపు చర్యలు చేపట్టారు .