వింత కేసుతో భర్తపై కోర్టుకు ఎక్కిన భార్య

ఈమద్య కాలంలో భార్య భర్తల మద్య బంధం చాలా పల్చగా తయారవుతోంది. చిన్న చిన్న విషయాలకు గొడవ పడటం.. ఆ గొడవలు ముదరడంతో విడాకుల వరకు వెళ్లడం జరుగుతుంది. భార్య భర్తల మద్య గొడవలకు కారణాలు వింటే నవ్వు వస్తుంది. తాజాగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఒక భార్య భర్తపై ఏకంగా కోర్టుకు వెళ్లింది. అతడు ఆమెను మానసికంగా హింసిస్తున్న కారణంగా ఆమె కోర్టుకు వచ్చినట్లుగా చెప్పుకొచ్చింది. ఆమె వాదనలు విన్న కోర్టు న్యాయమూర్తికి ఆశ్చర్యం కలిగి ఉంటుంది.

విషయం ఏంటంటే బిజ్నూరుకు చెందిన మహిళను ఆమె భర్త పదే పదే లావుగా ఉన్నావంటూ ఎగతాలి చేస్తూ ఉన్నాడట. లావుగా ఉన్న కారణంగా పట్టించుకోవడం లేదని, ఈమద్య అసలు బయటకు తీసుకోని వెళ్లడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. గతంలో ఉన్నట్లుగా ఇప్పుడు తను నాతో ఉండటం లేదు. అతడి ప్రవర్తనకు నాకు చాలా బాధగా ఉంది. లావు అవ్వాలని నేను అనుకోలేదు. బరువు తగ్గాలని ప్రయత్నించినా కూడా తగ్గలేక పోతున్నాను. దాన్ని అతడు అర్థం చేసుకోవడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. కోర్టు వాదనలు విని తీర్పును వాయిదా వేసింది. ఈ కేసు విషయంలో ఎలాంటి తీర్పు వెలువడుతుందో అనే ఆసక్తి అందరిలో వ్యక్తం అవుతోంది.