Site icon TeluguMirchi.com

విషీ కి చైనా చెక్

visawnadan anandప్రపంచ చెస్ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ కు అనూహ్య పరాజయం ఎదురైంది. నార్వే సూపర్ చెస్ టోర్నీలో చివరి రౌండ్ గెలిస్తే టైటిల్ వశమవుతుందన్న నేపథ్యంలో విషీ.. చైనా క్రీడాకారుడు వాంగ్ హావో చేతిలో పరాజయం పాలయ్యాడు. ఈ ఓటమితో టోర్నీలో ఆనంద్ నాలుగోస్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ప్రాథమిక రౌండ్లలో కర్జాకిన్, మాగ్నస్ కార్ల్ సన్ చేతిలో ఓటములు చవిచూడడం ఆనంద్ కు ప్రతికూలంగా మారింది.

Exit mobile version