సోమవారం నుంచి విశాఖ ల్యాబ్‌లో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేస్తామని ఏపీ వైద్యశాఖ మంత్రి ఆళ్ల నాని వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం 7 ల్యాబ్‌లు అందుబాటులోకి వస్తాయన్నారు. ఇకపై రోజుకు 500 టెస్ట్‌లు చేసే అవకాశం ఉంటుందన్నారు. రాష్ట్రంలో 236 క్యాంపులు నడుస్తున్నాయనీ.. ఇతర ప్రాంతాల్లో ఉన్నవారికి అక్కడే రేషన్ అందిస్తారని స్పష్టంచేశారు.
ఇదీలావుంటే ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 161కి చేరిందని వైద్య ఆఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్‌లో ప్రకటించింది. గురువారం రాత్రి 10 గంటల నుంచి శుక్రవారం ఉదయం 9గంటల వరకు కొత్తగా 12 కేసులు నమోదయ్యాయని తెలిపింది.