'టీ' లో పురుగుల మందు కలిపిన బాలిక..

తెలిసి తెలియక ఓ బాలిక తాగే టీ లో పురుగుల మందు కలపడం తో ఆది తాగి నలుగురు మృతి చెందిన ఘటన బిహార్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

అర్చన అనే పదేళ్ల బాలిక కుటుంబ సభ్యుల కోసం టీ తయారు చేస్తూ పొరపాటున అందులో పురుగుల మందు కలిపింది. కుటుంబ సభ్యులందరు ఈ విషం కలిపిన టీ తాగడంతో నలుగురు మృతిచెందగా.. మరో మహిళ పరిస్థితి విషమంగా ఉంది. మృతులు దుఖాన్‌ మహ్తో(60), రామ్‌స్వరూప్‌ మహ్తో(65), అర్చన(10), ప్రకాశ్‌మెహ్తోలుగా గుర్తించారు. ప్రమీలాదేవి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు మీడియా కు తెలిపారు.