ఏమాత్రం ఆచి తూచి ఆడకుండా చివరి వరకు కొనసాగి ఏకంగా 160 పరుగులు చేశాడు. నాటౌట్‌గా నిలిచి, ఛాన్స్ ఉంటే డబుల్ సెంచరీ చేసేవాడిని అన్నట్లుగా కోహ్లీ ఇన్నింగ్స్ కొనసాగింది. కోహ్లీ వీర బాదుడుతో టీం ఇండియా ఏకంగా 303 పరుగులు చేసింది. కోహ్లీకి మద్దతుగా నిలిచిన శిఖర్ దావన్ 76 పరుగులు చేశాడు. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ఈమ్యాచ్‌లో విఫలం అయ్యాడు. భారీ లక్ష్యంను ఛేదించేందుకు దక్షిణాఫ్రికా జట్టు కష్టపడుతుంది. ఆరంభంలోనే ఓపెన్ వికెట్‌ను కోల్పోయిన ఆ జట్టు ప్రస్తుతంకు నిలకడగా ఆడుతోంది.