ఇప్పటికే ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్న విరాట్ కోహ్లీ మరోసాని అద్బుత ప్రదర్శణతో ప్రత్యర్థి జట్టు బౌలర్లకు చుక్కలు చూపించాడు. కోహ్లీకి బౌలింగ్ చేసేందుకు దక్షిణాఫ్రికా బౌలర్లు భయపడ్డారు. బాబోయ్ మావల్ల కాదు అంటూ బంతిని తీసుకునేందుకు జంకారు. అందివచ్చిన బాల్స్‌ను బౌడరీకి తరలిస్తూ, మెల్ల మెల్లగా సెంచరీ సాధించిన విరాట్, ఆ తర్వాత కూడా తన దూకుడును కొనసాగించాడు.
ఏమాత్రం ఆచి తూచి ఆడకుండా చివరి వరకు కొనసాగి ఏకంగా 160 పరుగులు చేశాడు. నాటౌట్‌గా నిలిచి, ఛాన్స్ ఉంటే డబుల్ సెంచరీ చేసేవాడిని అన్నట్లుగా కోహ్లీ ఇన్నింగ్స్ కొనసాగింది. కోహ్లీ వీర బాదుడుతో టీం ఇండియా ఏకంగా 303 పరుగులు చేసింది. కోహ్లీకి మద్దతుగా నిలిచిన శిఖర్ దావన్ 76 పరుగులు చేశాడు. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ఈమ్యాచ్‌లో విఫలం అయ్యాడు. భారీ లక్ష్యంను ఛేదించేందుకు దక్షిణాఫ్రికా జట్టు కష్టపడుతుంది. ఆరంభంలోనే ఓపెన్ వికెట్‌ను కోల్పోయిన ఆ జట్టు ప్రస్తుతంకు నిలకడగా ఆడుతోంది.