రోహిత్‌తో కొన్ని రోజులుగా కోహ్లీ అంటీ ముట్టనట్లుగా ఉన్న కారణంగా ఇటీవలే అనుష్క శర్మను సోషల్ మీడియాలో రోహిత్ శర్మ ఫాలో అవ్వడం మానేశాడు. దాంతో ఆ వాదన మరింత పెరిగింది. ప్రస్తుతం టీం ఇండియా వెస్టిండీస్ సిరీస్‌కు సన్నాహకంగా ఉంది. ఈ సిరీస్ కోసం టీం ఇండియా చిన్న చిన్న మార్పులు చేసింది. ఈ పర్యటకు వెళ్లబోతున్న కోహ్లీ మీడియాతో చిట్ చాట్ చేశాడు. ఈ సందర్బంగా తనకు రోహిత్ శర్మ అంటే భయం ఏమీ లేదు. నా కెప్టెన్సీకి అతడి వల్ల ప్రమాధం అని నేను ఎప్పుడు భావించడం లేదు అంటూ విరాట్ కోహ్లీ ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు. రోహిత్ శర్మ బ్యాటింగ్‌కు తాను అభిమానిని అంటూ చెప్పుకొచ్చాడు.