దీన్నే బలుపు అంటారు

టీం ఇండియా మహిళ క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ వన్డేల్లో 6 వేల పరుగులు చేసిన బ్యాట్స్‌ ఉమెన్‌గా ప్రపంచ రికార్డును నెలకొల్పిన విషయం తెల్సిందే. ఒక ఇండియన్‌ బ్యాట్స్‌ఉమెన్‌ ఆ ఘనత సాధించడం పట్ల క్రికెట్‌ పండితులు, హేమా హేమీలు అద్బుతం అంటూ ప్రశంసలు కురిపించారు. మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌తో సహా ప్రముఖులు ఆమెను అభినందించారు. అందరు అభినందిస్తున్నారు తాను అభినందిస్తాను అనుకున్నాడో ఏమో మిథాలి రాజ్‌ 6 వేల వన్డే పరుగులు రాబట్టినందుకు అభినందనలు అంటూ టీం ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశాడు.

ఇక్కడే కోహ్లీ పెద్ద తప్పు చేసి విమర్శల పాలు అయ్యాడు. మిథాలిరాజ్‌కు అభినందనలు చెబుతూ పోస్ట్‌ చేసి ఫొటోను మాత్రం మరో క్రికెటర్‌ పూనమ్‌ రౌత్‌ ఫొటోను ట్వీట్‌ చేయడం జరిగింది. కోహ్లీ ఫాలోవర్స్‌ లక్షల్లో ఉంటారు. పోస్ట్‌ చేసిన క్షణాల్లోనే కోహ్లీ తప్పుగా పోస్ట్‌ చేశాడు అని దేశ వ్యాప్తంగా తెలిసి పోయింది. కాని ఆయన మాత్రం దాన్ని గుర్తించలేదు. నిమిషాల్లోనే వేలాది మంది ఫొటో తప్పుగా పెట్టారు అంటూ రీ ట్వీట్‌ చేసినా కూడా కోహ్లీ గుర్తించలేక పోయాడు. ఆ తర్వాత కొంత సమయంకు కోహ్లీ తన తప్పును గుర్తించారు. దాంతో మొత్తం పోస్ట్‌ను తొలగించాడు.

ఆ పోస్ట్‌లో పొరపాటున అలా జరిగింది అంటూ క్షమాపణ చెప్పి మరో కొత్త పోస్ట్‌ పెడితే కోహ్లీ స్థాయి పెరిగేది. కాని మొత్తంకు తీసేయడం వల్ల ఆయనపై విమర్శలు వస్తున్నాయి. మహిళలు అంటే కోహ్లీకి చులకన ఉండటం వల్లే ఈ పొరపాటు చేశాడు అంటూ విమర్శలు సోషల్‌ మీడియాలో కుప్పలు తెప్పలుగా చేస్తున్నారు. దీనినే బలుపు అంటారు అని కూడా కొందరు విమర్శలు చేస్తున్నారు.