బెంగళూరుకు చెందిన సూరి కుటుంబ సభ్యులు గత పది సంవత్సరాలుగా ఇదే తరహాలో వ్రతం చేసుకుంటున్నారట. వ్రతంకు వారం రోజుల ముందే తమ సన్నిహితులు అంతా కూడా బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బును అంతా డ్రా చేసుకుని వచ్చేస్తారు. ఆ మొత్తం డబ్బును ఇలా పేర్చి అందంగా అలంకరించి వ్రతం చేస్తామని సూరి చెబుతున్నాడు. ఇంత డబ్బుతో వ్రతం చేసినా తమకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే ఈ సొమ్ము అంతా కూడా లీగల్‌గానే సంపాదించిందని, తమకు ఎలాంటి భయం లేకుండా అమ్మ వారిని పూజించాము అని చెప్పుకొచ్చాడు. ఆ మొత్తం డబ్బు మళ్లీ ఎవరి అకౌంట్స్‌లోకి వారివి వెళ్లడం జరిగిందని ఆయన చెప్పుకొచ్చాడు. అలా వ్రతం చేయడం వ్ల తమకు కలిసి వస్తుందని, అందుకే అదే ఆనవాయితిని కొనసాగుతున్నట్లుగా ఆయన చెబుతున్నాడు. కొందరు మాత్రం ఈ వ్రతంపై విమర్శలు గుప్పిస్తున్నారు.