పవన్ కళ్యాణ్ మళ్ళీ వెండితెర పై సందడి చేయడానికి రెడీ అయ్యారు. అటు పవన్ కల్యాణ్ రీ ఎంట్రీ గురించి అభిమానులంతా ఆశగా ఎదురు చూశారు. మేలో `వకీల్ సాబ్` విడుదల కావాల్సింది. ఒకవేళ ఏప్రిల్ 14న లాక్ డౌన్ ఎత్తేస్తే.. వకీల్ సాబ్ రిలీజ్ మీద ఎన్నో కొన్ని ఆశలుండేవి.
ఇప్పుడు మే 3 వరకూ కొనసాగడంతో – వకీల్ సాబ్ పై ఆశలు ఆవిరైపోయాయి. ఇక వకీల్ సాబ్‌ని దసరాకి షిఫ్ట్ చేయాలని నిర్మాత దిల్ రాజు భావిస్తున్నారు. షూటింగ్ లు ఎప్పుడు మొదలైనా సరే… ఎలాంటి హడావుడి లేకుండా, మెల్లగానే సినిమాని పూర్తి చేయాలని ఆయన భావిస్తున్నారు.