Site icon TeluguMirchi.com

ఉత్తరప్రదేశ్ లో దారుణం : రూ. 200 కోసం దారుణ హత్య

క్రైం కు కేరాఫ్ అంటే ఉత్తరప్రదేశ్ అని అంత చెపుతుంటారు. నిత్యం ఈ రాష్ట్రంలో మహిళాలపై అత్యాచారాలు , కిడ్నాప్ లు , దొంగతనాలు , హత్య లు ఇలా ఏదో ఒకటి జరుగుతూనే ఉంటాయి. తాజాగా రూ. 200 కోసం ఓ వ్యక్తి ని హత్య చేసిన ఘటన చోటు చేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే..

అన్సార్ అహ్మ‌ద్ అనే వ్యక్తి శంష‌ద్ మార్కెట్‌లో ఒక టైర్ రిపేరింగ్ షాప్ నడుపుతుంటాడు. ఈ క్ర‌మంలో శుక్ర‌వారం సాయంత్రం ఆసిఫ్ అనే ఒక తాగుబోతు అత‌ని ద‌గ్గ‌రికి వ‌చ్చి కొద్దిసేపు బైక్ ఇవ్వ‌మ‌ని అడిగాడు.
అందుకు అన్సార్ అహ్మ‌ద్ ఒప్పుకోలేదు. ఆ రోజుకు సైలెంట్‌గా వెళ్లిపోయిన ఆసిఫ్.. శ‌నివారం సాయంత్రం మ‌ళ్లీ అన్సార్ అహ్మ‌ద్ ద‌గ్గ‌రికి వ‌చ్చాడు. రూ.200 కావాల‌ని అడిగాడు. అందుకు అన్సార్ నిరాక‌రించ‌డంతో జేబులోంచి నాటు తుపాకీ తీసి త‌ల‌పై కాల్చాడు. దాంతో అన్సార్ అక్క‌డిక‌క్క‌డే కుప్ప‌కూలి ప్రాణాలు విడిచాడు. ప‌క్క‌న ఉన్నవాళ్ల‌కు ఏం జ‌రుగుతుందే అర్థ‌మ‌య్యేలోపే నిందితుడు అక్క‌డి నుంచి పారిపోయాడు. కాగా, ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదుచేసి ద‌ర్యాప్తు మొదలుపెట్టారు.

Exit mobile version