సుదీర్ఘ కాలంగా అఫ్గనిస్తాన్‌లో సేవలు అందిస్తున్న అమెరికా సైనిక బలగాల ఉపసంహరణ పూర్తైంది. పెంటగాన్ ఈ విషయాన్ని ధ్రువీకరించింది. US జనరల్ కెన్నెత్ మెకాంజీ మాట్లాడుతూ.. ‘‘అఫ్గనిస్తాన్ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ, అమెరికా పౌరుల తరలింపు ప్రక్రియ పూర్తైందని ప్రకటన చేస్తున్నా. సెప్టెంబరు 11, 2001 నుంచి దాదాపు 20 ఏళ్లుగా అఫ్గన్‌లో చేపట్టిన ఆపరేషన్ ముగిసింది’’ అని పేర్కొన్నారు. హమీద్ కర్జాయి ఎయిర్‌పోర్టు నుంచి సీ-17 విమానం బయల్దేరడంతో బలగాల ఉపసంహరణ ముగిసిందన్నారు.