Site icon TeluguMirchi.com

మే నెలలో రికార్డు స్థాయిలో యూపీఐ పేమెంట్స్ !


డిజిటల్‌ లావాదేవీల్లో కీలక పాత్ర పోషిస్తున్న యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (#UPI ) మరో కొత్త రికార్డు నెలకొల్పింది. యూపీఐ ద్వారా చేసిన లావాదేవీల విలువ మే నెలలో ₹10 లక్షల కోట్లు దాటాయి. యూపీఐ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ఒక నెలలో ఇంత మొత్తంలో లావాదేవీలు జరగడం ఇదే తొలిసారి. మే నెలకు సంబంధించి #NPCI విడుదల చేసిన డేటా ఈ విషయాన్ని వెల్లడించింది. మే నెలలో మొత్తం 595కోట్ల లాదావాదేవీలు జరిగాయని #NPCI పేర్కొంది. ఏప్రిల్‌ నెలలో 558కోట్ల లావాదేవీలు జరిగాయని తెలిపింది. గతేడాది మే నెలలో UPIలావాదేవీలు రూ.5లక్షల కోట్లు ఉండగా,ఈ సారి రెట్టింపు అయ్యింది.

Exit mobile version