బార్బర్ గా మారిన మంత్రి కుమారుడు

కరోనా లాక్‌డౌన్ ఎవరినీ ఎటూ కదలనీయడం లేదు. హేర్ కటింగ్ సెలూన్లు కూడా మూసివేశారాయే. అందుకే కేంద్రమంత్రి రాంవిలాస్ పాశ్వాన్ కుమారుడు చిరాగ్ పాశ్వాన్ తన తండ్రికి గడ్డం చేయాల్సి వచ్చింది.

ఈ వీడియోను చిరాగ్‌ ట్వీటర్‌లో పంచుకున్నారు. ‘నాకు ఈ నైపుణ్యం కూడా ఉందని ఇప్పటివరకు తెలియదు. ఇది కష్టకాలమే.. అయినా కరోనాపై పోరాడదాం. అలాగే మంచి జ్ఞాపకాలను సృష్టించుకుందాం’ అని వీడియోకు కామెంట్ చేర్చారు. దీనిపై నెటిజన్లు లైకుల వర్షం కురిపిస్తున్నారు. ‘ఇది అపురూపం. ఓ కుమారుడు తన తండ్రికి ట్రిమ్‌ చేస్తున్నాడు’ అని రిట్వీట్లు చేస్తున్నారు.