అర్ధరాత్రి మహిళా నడిరోడ్డు మీద నడిచినప్పుడే నిజమైన స్వాతంత్ర్యం అని అంటుంటారు. అయితే ఇప్పుడు కొంతమంది ఆడవారు అర్ధరాత్రి నడిరోడ్డు మీదకు వస్తున్నారు..ఎందుకంటే మద్యం కోసం. అదేంటి అనుకుంటున్నారా..తాజాగా ఛత్తీష్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లోని ఓ పెట్రోల్ బంక్ కు అర్ధరాత్రి ఇద్దరు యువతులు వచ్చి మద్యానికి డబ్బులు ఇవ్వాలని నానా రచ్చ చేసారు.
వివరాల్లోకి వెళ్తే ..
రాయ్‌పూర్‌లోని జై జవాన్ జై కిసాన్ పెట్రోల్ బంక్.. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఇద్దరు యువతులు అక్కడకు వచ్చారు.. అక్కడి సూపర్వైజర్తో చిన్న గొడవ పెట్టుకున్నారు.. కొద్దిసేపటికి అక్కడికి ఓ కుర్రాడు వచ్చాడు.. మొత్తం ముగ్గురూ కలిసి సూపర్వైజర్తో వాగ్వాదానికి దిగారు.. మద్యం సేవించడానికి తమకు రూ.300 కావాలని అడిగారు.. అందుకు సూపర్వైజర్ నిరాకరించడంతో అతడిపై కత్తితో దాడి చేశారు.. అనంతరం ముగ్గురూ పారిపోయారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు సదురు యువతులను, యువకుడిని ఓ లాడ్జిలో అరెస్ట్ చేశారు.