Site icon TeluguMirchi.com

కరోనా కు అడ్డుకట్ట వేసే ఆయుర్వేద ఔషధాన్ని విడుదల చేసిన టీటీడీ

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ ఏ రేంజ్ లో కొనసాగుతుందో చెప్పాల్సిన పనిలేదు. ఈ మహమ్మారి ప్రస్తుతం 208 దేశాలకు విస్తరించింది. చైనాలో పుట్టిన కరోనా వైరస్.. అన్ని ఖండాలను తన స్వాధీనంలోకి తెచ్చుకుంది. కోవిడ్-19‌ కట్టడికి పలు దేశాలు లాక్‌డౌన్ విధించాయి. మొత్తం 350 కోట్ల మంది ఇళ్లకే పరిమితయ్యారు. కోట్లాది మంది జీవనోపాధిని సైతం మహమ్మారి చిన్నాభిన్నం చేసింది.

మన దేశంలోనూ కరోనా విపరీతం అవుతుంది. కరోనా దేశంలో అడుగుపెట్టగానే కేంద్రం లాక్ డౌన్ చేసి ప్రజలను ఇంటికే పరిమితం చేసినప్పటికీ విదేశాల నుండి వచ్చిన వారి కారణంగా దేశంలో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కరోనా కు అడ్డుకట్ట వేసే ఆయుర్వేద ఔషధాన్ని విడుదల చేసింది టీటీడీ.

ఎస్వీ ఆయుర్వేద కళాశాల, ఎస్వీ ఆయుర్వేద ఆసుపత్రి ఆధ్వర్యంలో రక్షజ్ఞ ధూపం (క్రిమిసంహారక ధూపం), పవిత్ర (చేతులు శుభ్రపరచుకునే ద్రావకం), గండూషం (పుక్కిలించే మందు), నింబనస్యం (ముక్కులో పోసుకునే చుక్కల మందు), అమృత (వ్యాధి నిరోధక శక్తి పెంచే మాత్ర)లను తయారు చేశారు. మంగళవారం రాత్రి టీటీడీ జేఈవో పి.బసంత్‌కుమార్‌ వీటిని విడుదల చేసారు .

Exit mobile version