కరోనాపై పోరుకు టీటీడీ విరాళం

కరోనాను కట్టడి చేయడానికి ఎవరికి తోచిన విధంగా వారు సాయం చేస్తూనే ఉన్నారు. సినీ, రాజకీయ ప్రముఖులు,పుణ్యక్షేత్రాలు, ట్రస్టులు సాయం ప్రకటిస్తున్నాయి. ఇదే బాటలో టీటీడీ కూడా చేరింది. తిరుమల తిరుపతి దేవస్థానం తరుపున కూడా భారీ సాయం అందిస్తామని ఈవో అనిల్ సింఘాల్ ప్రకటించారు. రూ. 19 కోట్లు ఏప్రీ ప్రభుత్వానికి ఇస్తున్నట్టు ఆయన తెలిపారు.

ఇప్పటికే రూ.8కోట్లు చిత్తూరు జిల్లా అధికారులకు ఇచ్చామని, మరో రూ.11 కోట్లను త్వరలో ఏపీ ప్రభుత్వానికి అందజేస్తామని వెల్లడించారు. అటు.. తిరుమలపై వస్తున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దని భక్తులను కోరారు. దర్శనం మాత్రమే ఆపేశామని.. ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీ వారికి జరగాల్సిన అన్ని పూజలు జరుగుతున్నాయని ఆయన వివరించారు.