Site icon TeluguMirchi.com

ఉచితంగా కరోనా బాధితుల మానసిక ఒత్తిడి తగ్గిస్తున్న సైకాలజిస్టులు

కరోనా మహమ్మారి కారణంగా అనేక కుటుంబాల్లో తీవ్రమైన మానసిక ఆందోళన నెలకొన్న నేపథ్యంలో మేమున్నామని సహాయం అందించాలన్న తపనతో ఆరుగురు సైకాలజిస్టులు స్వచ్ఛందంగా మానసిక ఒత్తిడి ఎదుర్కొంటున్న వ్యక్తులకు సలహాలు సూచనలు అందించి సాంత్వన కల్పిస్తున్నారు.

తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్ సభ్యులైన ఈ ఆరుగురు నిపుణులు తమ వ్యక్తిగత ప్రయోజనాలను పక్కనపెట్టి ఉచితంగా సలహాలు, సూచనలు, కౌన్సెలింగ్ అందించడం వైద్యరంగం పట్ల విశ్వాసాన్ని పునరుజ్జీవింప చేస్తోంది.

Exit mobile version