తెలంగాణ రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ తగ్గడం తో అన్ని ఓపెన్ చేసారు. దీంతో ప్రజలు ఫ్రీ గా తిరుగుతున్నారు. ఎక్కడ కూడా మాస్క్ పెట్టుకొని కనిపించడం లేదు. అయితే కరోనా మహమ్మారి మాత్రం చాపకింద నీరులా తన పని తాను చేసుకుంటూపోతుంది. గత నాల్గు రోజులుగా రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతూ వస్తున్నట్లు తెలుస్తుంది. వచ్చే నెలలో కరోనా మూడో దశ మొదలు కాబోతుందని అంత ప్రచారం అవుతున్న నేపథ్యంలో..రాష్ట్రంలో కేసులు పెరగడం ప్రజలను భయాందోళకు గురి చేస్తున్నాయి.
కరోనా థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ప్రజలంతా తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలంటూ హెచ్చరిస్తున్నారు. కాగా.. రాష్ట్రంలో నిన్న కొత్తగా 715 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. నలుగురు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 6,35,320 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఈ మహమ్మారి కారణంగా 3,751 మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 10,028 యాక్టివ్ కేసులు ఉన్నాయి.