ఇప్పటి వరకు మనం రైల్వే టికెట్స్ రిజర్వేషన్ కోసం మొబైల్ ద్వారా లేదా నెట్ కు వెళ్లి బుక్ చేసికొనెవాళ్ళం. కానీ ఇప్పుడు సాధారణ (జనరల్) టికెట్స్ కూడా మన మొబైల్ ఫోన్ ద్వారా బుక్ చేసుకొనే సదుపాయాన్ని దక్షిణమధ్య రైల్వే కల్పించనుంది. దీనికోసం ముందుగా రైల్వే సంస్థ ” యూటీఎస్ ఆన్ మొబైల్ ” అనే యాప్ కొన్ని రైల్వే జోన్లలో ప్రవేశపెట్టడం జరిగింది. ఇప్పుడు మిగతా రైల్వే జోన్లలో కూడా ప్రవేశపెట్టనుంది.అందులో మన దక్షిణమధ్య రైల్వే కూడా ఒకటి.
దక్షిణమధ్య రైల్వే లో కాస్త ఆలస్యంగా అయినా మరో రెండు, మూడు రోజుల్లో ప్రవేశపెట్టనున్నారు. ” యూటీఎస్ ఆన్ మొబైల్ ” అనే యాప్ వలన ప్రయాణికులు క్యూ లైన్ లో నిలబడవలసిన అవసరం లేదు. జోన్ పరిధిలో ఉన్న అన్ని రైల్వే స్టేషన్స్ కు ” యూటీఎస్ ఆన్ మొబైల్ ” సేవలు అందుబాటులో ఉండనున్నాయి.
ఈ జనరల్ టికెట్ తీసుకోవాలంటే “యూటీఎస్ ఆన్ మొబైల్” యాప్ లో ముందుగా మీ పేరు, చిరునామా, ఫోన్ నెంబర్, మొదలగు వివరాలు నమోదు చేసుకోవాలి. ఆ తరువాత ‘రైల్వే వాలెట్’లో కొంత డబ్బును జమ చేసుకోవాలి. ఈ యాప్ ద్వారా ఎన్ని రోజులు ముందైనా , ఎక్కడినుంచైనా సాధారణ (జనరల్) టికెట్స్ పొందవచ్చు. మీరు బుక్ చేసుకొన్నా టికెట్స్ డబ్బులు ‘రైల్వే వాలెట్ ‘ నుంచి తీసుకొనబడతాయి. ఏదైనా కారణంతో ప్రయాణం రద్దైతే టికెట్‌నూ రద్దు చేసుకోవచ్చట.