టోల్ ప్లాజాల వద్ద వాహనాలు సజావుగా, త్వరగా ప్రయాణించేలా చూడటానికి గాను భారత జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ (ఎన్‌హెచ్ఏఐ) పలు రకాల చర్యలను చేపడుతోంది. జాతీయ రహదారులు టోల్ ప్లాజాల వద్ద వాహనాలు వేచి ఉండే గరిష్ట సమయం 10 సెకన్లకు మించకుండా సేవా సమయం ఉండేలా తగు మార్గదర్శకాలను జారీ చేసింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం 100 మీటర్లకు మించి వాహనాలను క్యూలో నిలచిపోవడం అనుమతించకుండా.. టోల్ ప్లాజాల వద్ద నిరంతరాయంగా ట్రాఫిక్ ప్రవహించేలా చర్యలు చేపడుతోంది. నూరు శాతం తప్పనిసరి ఫాస్టాగ్ అమలు చేయడంతో.. దేశ టోల్ ప్లాజాల వద్ద చాలా వరకు నిరీక్షణ సమయమనేది లేకుండా పోయింది. అయితే కొన్ని కారణాల వల్ల 100 మీటర్లకు పైగా వాహనాలు వెయిటింగ్‌లో నిరీక్షించాల్సి ఉంటోంది.
అయితే.. తాజా మార్గదర్శకాల ప్రకారం.. వివిధ కారణాల వల్ల.. ఎక్కువ సమయం నిరీక్షించాల్సి వస్తున్న పలు వాహనాలు టోల్ ఫీజు కట్టకుండానే వెళ్లి పోయేందుకు వీలుగా తగిన అనుమతించనున్నారు. ఈ ప్రయోజనం కోసం, టోల్ బూత్ నుండి 100 మీటర్ల దూరంలో పసుపు గీతను.. ప్రతి టోల్ లేన్లో ఏర్పాటు చేయబడుతుంది. టోల్ ప్లాజా ఆపరేటర్లలో జవాబుదారీతనం భావనను మరింతగా కలిగించడానికి ఇది దోహదం చేస్తుంది.