టోక్యో ఒలింపిక్స్ -2020 లో ఈ సారి భారతదేశం తరపున మొదటిసారి పెద్ద ఎత్తున అథ్లెట్లు పాల్గొంటున్నారు. అథ్లెట్లలో ఆత్మస్థైర్యం పెంపొందించడానికి ఒలింపిక్స్ లో పథకాలు సాధించినవారికి భారీ నజరానాలను ప్రకటించాయి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు. ప్రపంచంలోని ధనిక దేశాలు కూడా ప్రకటించని నజరానాలను, మన రాష్ట్ర ప్రభుత్వాలు భారీ నజరానాలను ప్రకటించాయి. ఈవెంట్‌లో మెడల్ సాధించిన అథ్లెట్లకు రూ. 25 లక్షల నుంచి రూ. 6 కోట్ల వరకు ముట్టనుంది.
స్వర్ణ విజేతలకు రాష్ట్రాల నజరానా
రూ. 6 కోట్లు: యూపీ, హరియాణా, ఒడిశా
రూ. 5 కోట్లు కర్ణాటక, గుజరాత్
3 కోట్లు: ఢిల్లీ, రాజస్థాన్, సిక్కిం, TN
రూ. 2.25 కోట్లు: పంజాబ్
రూ. 2 కోట్లు:తెలంగాణ, హిమాచల్, జార్ఖండ్
రూ. 1.5 కోట్లు ఉత్తరాఖండ్
రూ. 1.2 కోట్లు మణిపూర్
రూ. కోటి మహారాష్ట్ర, కేరళ, గోవా
రూ. 75 లక్షలు ఆంధ్రప్రదేశ్, మేఘాలయ
రూ. 50 లక్షలు జమ్మూకశ్మీర్
రూ. 25 లక్షలు పశ్చిమ బెంగాల్.