నేడే ఐపీల్-6 తొలి ప్లేఆఫ్ !

ipl-6ఐపీఎల్-6 తుది అంకానికి చేరుకుంది. ఫైనల్ కు వెళ్లే జట్లను నిర్ణయించే ప్లేఆఫ్ కు నేడే తెరలేవనుంది. తొలి ఫైనలిస్టును తేల్చే క్వాలిఫయర్-I ఈరోజు ఢిల్లీలో రాత్రి 8 గంటల నుంచీ ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య హోరాహోరీ పోరు జరగనుంది. క్వాలిఫయర్-Iలో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ కు చేరుకుంటుంది. ఓడిన జట్టు మాత్రం (క్వాలిఫయర్ II) రాజస్థాన్-హైదరాబాద్ జట్లలో గెలిచిన జట్టుతో మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకునే అవకాశం ఉంటుంది. ఈ నెల 26న ఫైనల్ పోరు కోల్ కతాలో జరగనుంది. అయితే ఈరోజు తలపడనున్న రెండు జట్లు ప్రదర్శన, బలాబలాల ప్రకారం చూస్తే.. సమాన స్థితిలో ఉన్నాయి కాబట్టి హోరాహోరీ సమరం ఖాయం. సో.. క్రికెట్ ప్రేమికులకు పండగే మరి!