పులి దాడి లో 15 ఏళ్ల బాలిక మృతి

తెలంగాణ రాష్ట్రంలో గత కొద్దీ రోజులుగా పులుల సంచారం ప్రజలను భయపెడుతున్నాయి. ఓ దగ్గర పులి కనిపించిందని తెలిసిందో లేదో మరో చోటు పులి అడుగులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పులుల సంచారం ఎక్కువగా ఉంది.

మ‌హారాష్ర్గ‌-తెలంగాణ స‌రిహ‌ద్దుల్లో రెండు రోజుల క్రితం పులి ఓ వ్యక్తి ని చంపగా..తాజాగా పెంచిక‌ల్‌పేట మండ‌లం కొండ‌ప‌ల్లి గ్రామంలో నిర్మ‌ల‌(15) బాలిక‌పై పెద్ద‌పులి దాడి చేసి చంపేసింది. ఆదివారం ఉద‌యం తోటి కూలీల‌తో క‌లిసి బాలిక గ్రామానికి స‌మీపంలో ఉన్న‌ చేనులోకి ప‌త్తి ఏర‌డానికి వెళ్లింది. ప‌త్తి ఏరుతుండ‌గా మ‌ధ్యాహ్నం 2.30 గంట‌ల ప్రాంతంలో పెద్ద‌పులి క‌నిపించ‌డంతో కూలీలు అంద‌రూ ప‌రుగులు తీశారు. అక్క‌డ ఉన్న నిర్మ‌ల‌పైపులి దాడి చేయ‌డంతో బాలిక అక్క‌డిక‌క్క‌డే మృతి చెందింది. ప‌క్షం రోజుల వ్య‌వ‌ధిలోనే ఇద్ద‌రిపై దాడి చేసి చంపేయ‌డంతో అట‌వీ గ్రామాల ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌వుతున్నారు. ఎక్కడికి వెళ్తే ఎక్కడి నుండి పులి దాడి చేస్తుందో అని భయం భయం తో బ్రతుకుతూ ఇంట్లో నుండి బయటకు వెళ్లేందుకు వణికిపోతున్నారు.