పూణే కేంద్రంగా పనిచేస్తున్న థింకర్ టెక్నాలజీస్ ఇండియా సూక్ష్మజీవులపై దాడి చేసి వాటిని నిర్వీర్యం చేయగల సామర్ధ్యం కలిగి వుండే మాస్కులను అభివృద్ధి చేసింది. 3డి ప్రింటింగ్ ఔషధ మిశ్రమాలతో ఈ మాస్కును సంస్థ రూపొందించింది. అంకుర సంస్థగా ఏర్పాటైనథింకర్ టెక్నాలజీస్ ఇండియా కోవిడ్ వైరస్ వ్యాప్తిని అరికట్టే మాస్కుల తయారీపై పరిశోధనలను సాగించి వినూత్నంగా 3డి మాస్కులను అభివృద్ధిచేసింది. కోవిడ్-19 నివారణకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల్లో భాగంగా థింకర్ టెక్నాలజీస్ ఇండియా అభివృద్ధి చేసిన మాస్కులను వాణిజ్యపరంగా ప్రోత్సహించడానికి కేంద్ర శాస్త్ర సాంకేతికశాఖకు చెందిన టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డ్ ఎంపిక చేసింది.
కోవిడ్-19ని సమర్ధంగా ఎదుర్కోవడానికి వినూత్న విధానాలను రూపొందించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్న టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డ్ 2020 మేలో పరిశోధనలను చేపట్టడానికి థింకర్ టెక్నాలజీస్ ఇండియాకి నిధులను సమకూర్చింది. మాస్కుల అభివృద్ధిపై 2020 జులై 8న థింకర్ టెక్నాలజీస్ ఇండియా ఒప్పందంపై సంతకం చేసింది. సాధారణ ఎన్ 95, 3ప్లే, కాటన్ మాస్కులతో పోల్చి చూస్తే తాము అభివృద్ధి చేసిన మాస్క్ కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టే అంశంలో మరింత సమర్ధంగా పనిచేస్తుందని థింకర్ టెక్నాలజీస్ ఇండియా పేర్కొంది.