Site icon TeluguMirchi.com

అమెరికాలో విద్య, ఉపాధి అవకాశాలపై అవగాహన

thanaఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో ‘అమెరికాలో విద్య, ఉపాధి అవకాశాలు, వ్యక్తిగత భద్రత’ పై ఇంజనీరింగ్ విద్యార్థులకు స్థానిక భక్త రామదాసు కళాక్షేత్రంలో అవగాహనా సదస్సును నిర్వహించారు. అమెరికాలోని విశ్వవిద్యాలయాలు, అవి అందిస్తున్న కోర్సులను విద్యార్థులకు వివరించారు. తానా అధ్యక్షుడు తోటకూర ప్రసాద్, ఉపాధ్యక్షుడు నన్న్పనేని మోహన్, జంపాల చౌదరి, జయరాం తదితరులు సదస్సులో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రముఖులు విద్యార్థులకు పలు సూచనలు చేశారు.

Exit mobile version