Site icon TeluguMirchi.com

అమెరికాలో జంట బాంబు పేలుళ్లు !

Terror-returns-to-Americaఅమెరికాలోని బోస్టన్ మారథాన్ లో జంట బాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. దీంతో అమెరికాలోని పలు ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. కొన్ని సెకండ్ల వ్యవధిలో చోటు చేసుకున్న జంట బాంబు పేలుళ్లలో ముగ్గురు మృతిచెందగా, దాదాపు 141 మంది గాయాలపాలైనట్లు వైట్ హౌస్ అధికారులు వెల్లడించారు. ఈ బాంబు పేలుళ్లు ‘టెర్రరిస్టుల అటాక్’ గా అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో అధికారులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. రహదారులపై తనిఖీలు ముమ్మరం చేశారు. ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సెల్ ఫోన్‌ వాడకంపై కట్టడి విధించారు. న్యూయార్క్, వాషింగ్టన్‌ లలో కూడా భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఈ పేలుళ్లకు హోంమేడ్ బాంబులను వాడినట్టు అనుమానిస్తున్నారు.

కాగా, బోస్టన్ మారథాన్ లో చోటుచేసుకున్న జంట పేలుళ్ల ఘటనను అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తీవ్రంగా ఖండించారు. పేలుళ్ల అనంతరం శ్వేత సౌధం నుంచి ఒబామా మాట్లాడుతూ.. తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు. ఈ ఘటనపై విచారణ జరిపి పేలుళ్లకు పాల్పడినవారిని కఠినంగా శిక్షిస్తామని పేర్కొన్నారు. సహాయక చర్యలపై ఒబామా అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తున్నారు.

Exit mobile version