గూగుల్ సెర్చ్ లో తృతీయ స్థానం తెలుగుదే

telugu-top-three-in-google-గూగుల్ సెర్చ్ లో తృతీయ స్థానం తెలుగుదే గూగుల్ సెర్చ్ లో ఎక్కువగా వెతికే భారతీయ భాషల్లో తెలుగుది మూడవ స్థానం అని గూగుల్ ప్రకటించింది. భారతీయులు సెర్చ్ చేసే సామాజిక సైట్లు, గూగుల్ సెర్చ్ లో తొలి రెండు స్థానాల్లో హిందీ, తమిళం ఉండగా మూడో స్థానంలో తెలుగు నిలిచింది. ప్రపంచవ్యాప్త నెట్ యూజర్లలో గూగుల్ ఉపయోగించే వారిపై నిర్వహించిన సర్వే ఈ రకంగా తెలిపిందని గూగుల్ ప్రకటించింది. ఎన్నారైలలో ఎక్కువ మంది తెలుగు, తమిళం భాషలను సెర్చ్ చేస్తున్నారన్న గూగుల్, ప్రతి 9 ఏళ్లకు ఓసారి జరిపే ఈ సర్వేలో ఈ నిజాలు బయటపడ్డాయని తెలిపింది.