టెలిగ్రాం చరిత్ర ముగుసింది

teli2ఈరోజు (ఆదివారం)రాత్రి 9గంటలతో 163ఏళ్ల చరిత్ర గలిగిన టెలిగ్రాఫ్ సర్వీసులకు ముగింపు పలకనున్నారు. రాత్రి 9గంటలనుండి ఈ సేవలకు స్వస్తి చెబుతున్నట్లు బిఎస్ఎన్ఎల్ వర్గాలు తెలిపాయి. సోమవారం నుండి టెలిగ్రాం సేవలు అందుబాటులో ఉండవని పేర్కొన్నారు. గ్లోబల్ పల్లె గా మారిపోవడం, మొబైల్ ఫోన్లు, అంతర్జాలం వాడకం పెరిగిపోవడం తో టెలిగ్రాం సేవలు చిన్నబోయాయి. నేడు టెలిగ్రాం వ్యవస్థ నిర్వహణకు దేశంలో వార్షికంగా 100 కోట్ల రూపాయలు ఖర్చవుతుంటే ఆదాయం 75 లక్షల రూపాయలు మాత్రమే వస్తోంది. దీంతో ఈ సేవలను నిలిపివేయాలని బీఎస్ఎన్ఎల్ నిర్ణయించింది.ఇక ఎన్నేళ్ళ పాటు ప్రజల జీవితాలతో మమేకమైన టెలిగ్రాం నేటితో శాశ్వత సెలవు తీసుకుంటోంది.