తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ర్టంలోని ప్రభుత్వ, ప్రయివేటు విద్యాసంస్థలన్నింటినీ తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు.
రాష్ట్రంలో విద్యాసంస్థల మూసివేత నిర్ణయంతో ఇప్పటికే షెడ్యూల్ అయిన డిగ్రీ, పీజీ పరీక్షలు వాయిదా పడ్డాయి. దీనిపై తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి స్పందిస్తూ తెలంగాణ రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీ పరిధిలలో షెడ్యూల్ ప్రకారం జరగబోయే పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. రీషెడ్యూల్ తర్వాతనే పరీక్షల నిర్వహణ ఉంటుంది, త్వరలోనే రీ షెడ్యూల్ ప్రకటిస్తాం అని అన్నారు.