సిద్దిపేట జిల్లాలో తొలి కరోనా కేసు నమోదైంది. గజ్వేల్‌కు చెందిన 51ఏళ్ల వ్యక్తికి కరోనా నిర్ధారణ అయినట్లు కలెక్టర్ వెంకట్రామిరెడ్డి తెలిపారు. బాధితుడు ఇటీవల దిల్లీలోని నిజాముద్దీన్‌లో జరిగిన మత పరమైన సమావేశాలకు హాజరై తిరిగి వచ్చాడు. ఈ క్రమంలో అతనికి కరోనా వైరస్ లక్షణాలు ఉండటంతో రెండు రోజుల క్రితం సిద్దిపేట ఐసోలేషన్ కేంద్రానికి తరలించారు. అతని గొంతు నుంచి నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపగా కరోనా పాజిటివ్ అని తేలింది.
ఇదీలావుంటే రాష్ట్రంలో సుమారు 25 వేల మంది హోమ్ క్వారెంటైన్‌లో ఉన్నారని. వారందరినీ ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తున్నట్లు మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. ఇవాళ ఆయన తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఈ విషయాన్ని తెలిపారు. క్వారెంటైన్‌లో ఉన్నవారిని జీపీఎస్ పద్ధతి ద్వారా ట్రాక్ చేస్తున్నట్లు చెప్పారు.