Site icon TeluguMirchi.com

2 వన్డేలో టీం ఇండియా ఘన విజయం

ప్రపంచ కప్‌ తర్వాత వెస్టిండీస్‌తో క్రికెట్‌ ఆడుతున్న టీం ఇండియా మంచి ప్రదర్శణను కనబర్చుతుంది. ఇప్పటికే టీ20 సిరీస్‌ను నెగ్గిన టీం ఇండియా ప్రస్తుతం వన్డే సిరీస్‌ను ఆడుతోంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా మొదటి వన్డే వర్షార్పణం అయ్యింది. వర్షం కారణంగా మొదటి వన్డే పూర్తిగా రద్దు అయ్యింది. ఇక రెండవ వన్డేలో టీం ఇండియా ఆల్‌ రౌండ్‌ ప్రతిభతో ఘన విజయం సాధించింది. రెండవ వన్డే సమయంలో కూడా వర్షం రావడంతో డక్వర్త్‌ లూయిస్‌ ప్రకారం ఇండియా 59 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన టీం ఇండియా ఓపెనర్లు రాణించకున్నా కోహ్లీ మంచి ఆటతో సెంచరీ సాధించాడు.

వన్డేల్లో 42వ సెంచరీని కోహ్లీ సాధించాడు. ఈ వన్డేలో పలు రికార్డులు బ్రేక్‌ అయ్యాయి. ఓపెనర్లు ధావన్‌ మరియు రోహిత్‌ శర్మలు తక్కువ స్కోర్‌కే ఔట్‌ అవ్వడంతో బాధ్యత కోహ్లీపై పడింది. కోహ్లీకి మద్దతుగా శ్రేయాస్‌ నిలబడ్డాడు. కోహ్లీ 125 పరుగులు సాధించగా, శ్రేయాస్‌ 71 పరుగులు చేశాడు. మొత్తం 279 పరుగులు సాధించింది. ఇక విండీస్‌ ఆరంభంలో కాస్త హడావుడి చేసినా భువనేశ్వర్‌ కుమార్‌ ధాటికి బొక్క బోర్లా పడ్డట్లయ్యింది. కెరీర్‌లో 300వ వడ్డే ఆడిన గేల్‌ కేవలం 11 పరుగులు మాత్రమే కొట్టి నిరాశ పర్చాడు. ఈమద్య కాలంలో గేల్‌ బ్యాట్‌ నుండి పరుగులు రావడమే గగనం అయ్యింది. మూడు వన్డేల సిరీస్‌ ప్రస్తుతం 1-0తో ఇండియా వైపు ఉంది. చివరి వన్డేలో ఇండియా గెలిస్తే సిరీస్‌ కైవసం చేసుకుంటుంది, ఓడితే సిరీస్‌ను పంచుకుంటుంది.

Exit mobile version