Site icon TeluguMirchi.com

'టీ' పేరు చెప్పి ఆత్యాచారం.

Tea-Rep
ఏడేళ్ల బాలిక ను టీ తాగిస్తానని చెప్పి ఆత్యాచారం చేసిన ఘటన వికారాబాద్ లోని తాండూర్ ఆసుపత్రి లో చోటు చేసుకుంది. తాండూరు మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన బాలిక అమ్మమ్మ , వైద్యం కోసం జిల్లా ఆస్పత్రిలో చేరింది. శనివారం రాత్రి అమ్మమ్మతో ఆస్పత్రి ఆవరణలో ఉన్న బాలికను గుర్తు తెలియని వ్యక్తి టీ తాగిస్తానని అక్కడి నుంచి తీసుకువెళ్లాడు.

ఎంతసేపటికి ఆ బాలిక తిరిగిరాకపోయేసరికి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాత్రి విధులు నిర్వహిస్తున్న పురపాలక సిబ్బంది కొడంగల్‌ రోడ్డులో బాలికను గుర్తించి పోలీసులకు అప్పగించారు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబీకులు బాలికను ఆరా తీయగా జరిగిన అఘాయిత్యాన్ని వివరించింది. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌ తరలించారు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Exit mobile version