ఎన్ని చట్టాలు వచ్చిన , శిక్షలు విదిస్తున్నప్పటికీ కామాంధులు మారడం లేదు. అభం శుభం తెలియని చిన్నారులపై , ఒంటరి మహిళల ఫై ఆఖరికి ముసలివారిని సైతం వదలడం లేదు. తాజాగా ఉత్తరప్రదేశ్ లో 13 ఏళ్ల బాలిక ఫై అత్యాచారం చేసి శీలానికి వెలకట్టారు.
వివరాల్లోకి వెళ్తే …
ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్ గంజ్ జిల్లాలో కోఠిభర్ పోలీస్ స్టేషన్ ప్రాంతం పరిధిలోని ఓ గ్రామంలో 23 సాయంత్రం పొలంలో కూరగాయలు కోస్తుండగా.. నిందితుడు 13 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశాడు. అనంతరం నిందితుడు బాలికను అక్కడ వదిలేసి పారిపోయాడు. తరువాత ఇంటికి చేరిన బాలిక ఈ సంఘటన గురించి కుటుంబసభ్యులకు వివరించింది. ప్రాణభయం ఉండటంతో.. భయపడిన బాధితురాలు కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేయకుండా.. న్యాయం కోసం గ్రామ పంచాయితీ పెద్దను సంప్రదించింది.
దీంతో సదరు యువకుడిని పిలిపించి పెద్దలు బాధితురాలినే తిరిగి అవమానించారు. అత్యాచారం చేయటం తప్పే గానీ..ఆ తప్పుకు నిందితుడికి రూ.50 వేలు జరిమానా వేస్తున్నామనీ..ఐదు చెప్పు దెబ్బలు శిక్ష వేసి వదిలేశారు. రూ.50వేలు తీసుకుని నీపై అత్యాచారం చేసిన వాడిని నీ కోపం తీరేలా చెప్పుతో కొట్టి ఈ విషయం ఇంతటితో వదిలేయ్..పోలీసులకు ఫిర్యాదుల్లాంటివేమీ పెట్టుకోవద్దు అంటూ బాధితురాలి కుటుంబాన్ని బెదిరించారు.దీంతో స్వంత గ్రామస్తులే ఓ ఆడపిల్లకు జరిగిన అన్యాయానికి డబ్బులతో వెల కడతారా? అంటూ బాలిక మనస్తాపానికి గురైంది.